ట్విట్టర్‌లో పవన్ ఫాలో అవుతున్నది ఇతడినే..

ట్విట్టర్‌లో పవన్ ఫాలో అవుతున్నది ఇతడినే..

దాదాపు నాలుగేళ్ల క్రితం ట్విట్టర్‌లో చేరిన జనసేన అధినేత, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు 32 లక్షల మంది ఫాలోవర్లున్నారు. పవన్‌... తన వ్యక్తిగత, పార్టీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ట్వీట్‌ చేస్తే.. వాటిని ఫ్యాన్స్‌ రీట్వీట్లు, షేర్లు చేస్తుంటారు. ఎప్పుడో తప్ప పవన్‌ వేరొకరిది రీట్వీట్‌ చేయరు. ఇంతవరకూ ట్విట్టర్‌లో ఏ ఒక్కరినీ ఫాలో కూడా కాలేదు. కానీ ఇప్పుడు ఓ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. ఆయనెవరో కాదు.. బిగ్‌బీ అమితాబ్‌.. 
పవన్‌ రెండు రోజుల క్రితం ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. దేశభక్తిని రగిల్చే విధంగా చేసిన ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌ను అమితాబ్‌ 'జైహింద్‌' అంటూ రీట్వీట్‌ చేశారు. దీనికి స్పందించిన పవన్‌..  'అమితాబ్ జీ.. మీరంటే నాకు అమితమైన గౌరవం. నా మిత్రుడు ఇండియన్ ఆర్మీ గురించి నాకు పంపిన సందేశాన్ని ట్వీట్‌ చేశా. మీరు రీట్విట్‌ చేయడం ఆనందంగా ఉంది' అంటూ మరో ట్వీట్‌ చేశారు. వెనువెంటనే అమితాబ్‌కు 'ఫాలో'వర్‌గా మారారు..