మళ్ళీ రీమేక్ అంటున్న పవన్ డైరెక్టర్

మళ్ళీ రీమేక్ అంటున్న పవన్ డైరెక్టర్

ఇతర భాషల్లో సూపర్ హిట్టైన సినిమాలను రిమేక్ చేయడం వలన సేఫ్ జోన్ లో ఉండొచ్చనే ఆలోచన చాలా మంది దర్శకులకు ఉంటుంది.  మూలకథ, కథనాలను అలాగే తీసుకొని నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసుకొని రీమేక్ చేస్తే సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉంటాయి.  ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్న హరీష్ శంకర్ బాలీవుడ్ లో సూపర్ హిట్టైన దబాంగ్ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు.  ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్.  తరువాత హరీష్ శంకర్ సినిమాలు చేసిన పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా హిట్ కాలేదు.  

ఇప్పుడు మరలా రీమేక్ ను నమ్ముకొని సినిమా చేయాలని హరీష్ శంకర్ భావిస్తున్నాడు.  తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండ్రా అనే సినిమాను రీమేక్ చేయబోతున్నాడట.  14 రీల్స్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు హరీష్ శంకర్.  పెట్ట సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కార్తీక్ సుబ్బరాజ్ జిగర్తాండ్రా సినిమాకు దర్శకుడు.  ఈ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నది.