జనసేనాని కొత్త నిర్ణయం..!

జనసేనాని కొత్త నిర్ణయం..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాల్లో జనసేన పోరాట యాత్రల పేరుతో పర్యటనలు చేస్తున్న పవన్... జిల్లాల్లో పోరాట యాత్రలు ఆపాలని నిర్ణయానికి వచ్చారు. ఇకపై జిల్లాల్లో సమస్యలపై స్పందిస్తూ పర్యటించాలని నిర్ణయించారు. సంక్రాంతి పండుగ తర్వాత నుంచి జిల్లాల్లో సమస్యలపై జనసేనాని పర్యటనలు ప్రారంభం కానున్నాయి. సాధారణ ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ, జిల్లాల్లో తిరిగేలా కొత్త నిర్ణయం తీసుకున్నారు పవన్ కల్యాణ్.