షూటింగ్ కు సిద్దమవుతున్న పవర్ స్టార్

షూటింగ్ కు సిద్దమవుతున్న పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80శాతానికి పైగా పూర్తి చేసుకుంది. పవన్ ను స్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పరిస్థితులు బాగుండి ఉంటే ఈపాటికి 'వకీల్ సాబ్' థియేటర్స్ లో సందడి చేసేది. కానీ కరోనా ఊహించని షాక్ ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదా పడింది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని పవన్ భావిస్తున్నాడట. ఇప్పటికే కొన్ని సినిమాలు దైర్యం చేసి షూటింగ్ లను మొదలు పెట్టాయి. ఇక స్టార్ కూడా తమ తమ సినిమాలను స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నారు. మరో వైపు ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ సినిమా కూడా త్వరలో షూటింగ్ మొదలు పెట్టనుంది. దాంతో పవన్ కూడా తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడని తెలుస్తుంది. పవన్ గతంలో మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ చేయకపోవడమే మంచింది అన్నట్టు మాట్లాడారు. డిసెంబర్ చివరివరకు పవన్ షూటింగ్ కు రాకపోవచ్చు అని కూడా టాక్ నడిచింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చకుని డిసెంబర్ కు ముందే అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ లో షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వకీల్ సాబ్ ఎలాగో 80 శాతం పూర్తయ్యింది కాబట్టి మిగిలిన కొంత భాగాన్ని పూర్తి చేయాలనీ పవన్ భావిస్తున్నాడట.