మూడు రోజులు అక్కడే పవన్..

మూడు రోజులు అక్కడే పవన్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు అమరావతిలో పర్యటించి కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అమరావతిలో ఉండనున్నారు. 14వ తేదీన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్న పవన్.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే 16వ తేదీన ఏలూరు, బెజవాడ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన జనసేన పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు పవన్ కల్యాణ్.