మెగా బర్త్ డే వేడుకకు పవన్ స్పెషల్ గెస్ట్..!!!

మెగా బర్త్ డే వేడుకకు పవన్ స్పెషల్ గెస్ట్..!!!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఈనెల 22వ తేదీన భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  మాములుగా పుట్టినరోజు వేడుకలకు మెగాస్టార్ దూరంగా ఉంటారు.  చాలా తక్కువ సందర్భాల్లో పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ పాల్గొంటూ ఉంటారు.  ఈసారి కూడా మెగాస్టార్ ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నారు.  అయితే, మెగా కుటుంబం ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.  

ఆగష్టు 22వ తేదీన శిల్పకళా వేదికలో వేడుకలు జరగబోతున్నాయి.  ఈ వేడుకలకు మెగా హీరోలందరూ హాజరుకాబోతున్నారని వినికిడి.  రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇలా అందరూ హాజరువుతున్నారట.  ఇక్కడ విషయం ఏమిటంటే.. ఈ వేడుకలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు.  పవన్ కళ్యాణ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైతే.. ఆ హంగామా వేరుగా ఉంటుంది.  రంగస్థలం విజయోత్సవ సభ తరువాత పవన్.. చరణ్ కలవలేదు.  నాపేరు సూర్య వేడుక తరువాత బన్నీ.. పవన్ కలుసుకోలేదు.  మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ హీరోలంతా ఒకేచోట కలిస్తే.. మెగా అభిమానులకు కన్నుల పండుగే అని చెప్పొచ్చు.