ఇవాళ రెండు జిల్లాల నేతలతో పవన్ భేటీ..

ఇవాళ రెండు జిల్లాల నేతలతో పవన్ భేటీ..

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం తర్వాత సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఇవాళ మరో రెండు జిల్లాలకు చెందిన నేతలతో సమావేశం కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన నేతలతో సమీక్ష నిర్వహించిన జనసేనాని... ఇవాళ తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లా నేతలతో సమీక్షలు జరపనున్నారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై నేతలతో ఆయన చర్చించనున్నారు. అలాగే త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎత్తుగడలపై చర్చించనున్నారు.