జనసేన అభ్యర్థులతో నేడు పవన్ భేటీ..

జనసేన అభ్యర్థులతో నేడు పవన్ భేటీ..

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల బరిలో దిగిన అభ్యర్థులతో ఇవాళ సమావేశం కానున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అభ్యర్థులతో భేటీకానున్న పవన్... సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం అందించారు. ఈ సమావేశంలో పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలు, ఏయే స్థానాల్లో పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయనే అంశాలపై చర్చలు జరపున్నారు. ఇక కౌంటింగ్ రోజు ఎలా వ్యవహరించాలి అనే అంశంపై అభ్యర్థులతో మాట్లాడనున్నారు జనసేనాని.