సీట్ల సర్దుబాటుపై అసంపూర్తిగా ముగిసిన చర్చలు

సీట్ల సర్దుబాటుపై అసంపూర్తిగా ముగిసిన చర్చలు

విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌‌ కల్యాణ్ వామపక్షనేతలతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసాయి. సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీ నేతలు చర్చించారు. ముఖ్యంగా ఈ భేటీలో విజయవాడ పశ్చిమ సీటుపై సయోధ్య కుదరలేదు. ఈ రోజు సాయంత్రం మరోసారి వామపక్ష నేతలతో పవన్‌ సమావేశం కానున్నారు. సాయంత్రంలోపు విజయవాడ పశ్చిమ సీటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇక జనసేన పోటీకి దిగాలని భావిస్తున్న విజయవాడ పశ్చిమ, రంపచోడవరం, పీ.గన్నవరం వంటి 5 స్థానాలను వామపక్ష పార్టీలు ఆశిస్తున్నాయి. వీటిపై స్పష్టత రాకపోవడంతో.. చర్చలు అర్ధంతరంగా ముగిసాయి. సీపీఎంకు కోరుకున్న అన్ని సీట్ల విషయంలో సయోధ్య కుదిరింది. అయితే సీపీఐ సీట్ల విషయంలోనే స్పష్టత రాలేదు. సాయంత్రం జరిగే చర్చలు కూడా విఫలమైతే.. జనసేనను విడిచి సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.