నిహారిక ఎంగేజ్మెంట్ లో కనిపించని పవన్.. సోషల్ మీడియాలో  చర్చ

నిహారిక ఎంగేజ్మెంట్ లో కనిపించని పవన్.. సోషల్ మీడియాలో  చర్చ

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్ధం నిన్న ( ఆగస్టు 13) రాత్రి  హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోట‌ల్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్ రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ వెంక‌ట చైత‌న్య‌తో నిహారిక ఎంగేజ్‌మెంట్  పెద్ద‌ల స‌మ‌క్షంలో జ‌రిగింది.ఇక ఈ వేడుకకు మెగా ఫ్యామిలి మినహా సినిమా ఇండస్ట్రీ లో ఎవ్వరూ హాజరు కాలేదు. కాగా పవన్ కళ్యాణ్ కూడా హాజరుకాలేదు. దాంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. స్వామీజీలు పీఠాధిపతులు ఆచరించే చాతర్మాస్య వ్రతం ఆచరిస్తున్నాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదా అని అందరు చెప్పుకుంటున్నారు. అయితే యంగ్ హీరో నితిన్ పెళ్ళికి హాజరైన పవన్ ఇలా సొంత ఇంటి ఫంక్షన్ కు హాజరు కాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.