ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు పవన్ పరామర్శ..

ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు పవన్ పరామర్శ..

నంద్యాల ఎంపీ, జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి, దివంగత ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులను నంద్యాలలో పరామర్శించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎస్పీవై రెడ్డి.. ప్రచారంలో ఉన్న సమయంలోనే అనారోగ్యానికి గురయ్యారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా... చికిత్సపొందుతూ ఆయన ఏప్రిల్ 30వ తేదీన కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఇవాళ నంద్యాల వెళ్లిన జనసేన అధినేత పవన్... ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి.. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల, అల్లుడితో మాట్లాడి ఓదార్చారు... పవన్ వెంట జనసేన నేత నాదెండ్ల మనోహర్ తదితర నేతలున్నారు.