ఉదయం షూటింగ్ - సాయంతం పాలిటిక్స్... దట్ ఈజ్ పవన్... 

ఉదయం షూటింగ్ - సాయంతం పాలిటిక్స్... దట్ ఈజ్ పవన్... 

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమా ఈరోజు నుంచి షూటింగ్ మొదలైంది.  ఈ ఉదయం హైదరాబాద్ లో షూటింగ్ ను ప్రారంభించారు.  వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ షూటింగ్ జరుగుతున్నది. ముందుగా షెడ్యూల్ నిర్ణయం కావడంతో పవన్ కళ్యాణ్ ఉదయం షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న తరువాత సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు వచ్చారు.  అక్కడి నుంచి మంగళగిరిలో జరిగే పార్టీ అత్యవసర మీటింగ్ లో పాల్గొనబోతున్నారు.  

ఈ మీటింగ్ లో అనేక కీలక విషయాలు చర్చించబోతున్నారు. అయితే, అమరావతి రగడ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో పాల్గొనడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.  సినిమా చేయడం తప్పుకాదని, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తానని పవన్ అంటున్నారు. కాగా, ఈరోజు రాజధాని విషయం కీలకంగా మారడంతో పవన్ ఉదయం నుంచి రాజధాని ప్రాంతంలో అందుబాటులో ఉంటె బాగుండేదని అంటున్నారు.