పవన్ ఎంట్రీ వీడియో విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ షూటింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నేడు రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేసింది. సినిమా షూటింగ్ సాగిన తీరును చూపిస్తూ పవన్ ఎంట్రీ అవుతున్న సీన్ ను చూపించారు. దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకుడితో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సెట్స్ లో కనిపించారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా, ఈ సినిమాకి అధికారికంగా ఇంకా ఏ హీరోయిన్ ను ప్రకటించలేదు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)