మొదలైన పవన్, రానా సినిమా షూటింగ్
మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటంతో పాటుగా, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ నేడు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. ఈ భారీ సెట్ లోనే సినిమా దాదాపుగా నెల రోజులు పాటు షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఇక ఈ సినిమాకు హీరోయిన్లుగా చాలా మంది పేర్లు వినిపిస్తున్న ఇంతవరకు చిత్రయూనిట్ అధికారికంగా ఎవరి పేర్లను అనౌన్స్ చేయలేదు. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి తెలుగులో ‘బిల్లా-రంగా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)