బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం : పవన్ కల్యాణ్

బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం : పవన్ కల్యాణ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని సిద్దిపేట కు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేయడం దుందుడుకు చర్య. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో  బండి సంజయ్ పైనా, బీజేపీ నాయకులపైనా పోలీసుల చర్యలు పలు సందేహాలకు తావిస్తోంది. ఉద్రిక్తతలకు తావిచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నియమావళిని, నిబంధనలను అన్ని పార్టీలకు ఒకేలా వర్తింపచేయాలి. పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థినీ, శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వెళ్ళడం గర్హనీయం. బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం. ఈ అరెస్టును ఖండిస్తున్నాం అని పవన్ కల్యాణ్ తెలిపారు.