అత్యాచారాలపై పవన్ సంచలన వ్యాఖ్యలు 

అత్యాచారాలపై పవన్ సంచలన వ్యాఖ్యలు 

దేశంలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న అంశం దిశ అత్యాచారం, హత్య కేసు.  దీనిపై ప్రతి రాజకీయ నాయకుడు స్పందిస్తున్నారు.  నిందితులను కఠినంగా శిక్షించాలని అంటున్నారు.  దీనిపై ఈరోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మాట్లాడారు. ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు అన్నగా, ఓ తమ్ముడిగా గుండెలు ఎలా కొట్టుకుంటాయో తనకు తెలుసునని పవన్ పేర్కొన్నారు. రూ. 1000, రూ.2000 కోసం మహిళా జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్ కు వస్తుంటారని, వారిని కొంతమంది మగవాళ్ళు హింసించిన సంఘటనలు తనకు తెలుసునని, తాను కర్రపట్టుకొని వాళ్ళను తరిమికొట్టిన సందర్భాలు ఉన్నాయని అన్నారు.  

దిశ కేసులో అత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న సంగతితెలిసిందే.  ఉరితీయడం కాదని, వారిని సింగపూర్ తరహాలో తోలు ఊడేలా బెత్తంతో కొట్టాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.  బెత్తంతో తోలు ఊడేలా కొడితే.. వాళ్లకు బుద్ది వస్తుందని పవన్ పేర్కొన్నారు.