హీరోలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు 

హీరోలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు 

పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో  ఉన్నారు.  ఈరోజు తిరుపతిలో జనసేన కార్యకర్తలతోను, భాషా పండితులతోనూ సమావేశం అయ్యారు.  తెలుగు వైభవం పేరుతో తెలుగు భాష  గురించి, తెలుగు భాష ఔన్నత్యం గురించి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోలలో చాలా మందికి తెలుగు మాట్లాడటం వచ్చేమోగాని తెలుగు రాయడం, చదవడం తెలియదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.  తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు భాష దిగజారిపోతోందని పవన్ కళ్యాణ్ ఆవేదన చెందారు.  

అంతేకాదు, రానురాను పరిశ్రమలో తెలుగు పాండిత్యం తగ్గిపోతుందని అన్నారు.  తెలుగు సినిమాలో బూతు పదాలు ఎక్కువయ్యాయని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు హీరోల గురించి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.