పవన్ సంచలన వ్యాఖ్యలు.. ప్రభుత్వం కూలిపోతుంది..!

పవన్ సంచలన వ్యాఖ్యలు.. ప్రభుత్వం కూలిపోతుంది..!

రాజధాని వ్యవహారం కాకరేపుతూనే ఉంది.. దీనిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అమరావతి నుంచి రాజధాని కదిలేది లేదన్న ఆయన.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ముట్డడిలో గాయపడ్డ అమరావతి గ్రామాల రైతులను జనసేనాని పరామర్శించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన రైతులతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ ప్రభుత్వాన్ని కూల్చేవరకు తాను నిద్రపోనన్నారు. మహిళలు అని చూడకుండా పోలీసులు లాఠీఛార్జ్ చేయడం వైసీపీ నేతల అధికార మదమేనని మండిపడ్డారు. తనకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది.. ఢిల్లీకి వెళ్తున్న... నేను మీకు చెప్పడం లేదు.. కానీ, అద్భుతాలు జరగబోతున్నాయన్నారు. 

ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోందని ఆరోపించిన జనసేనాని... వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే అన్నారు.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదన్న పవన్.. జనసేన బలపడుతుందో లేదో కానీ... కన్నీళ్లు కార్చిన రైతులు ఆనందబాష్పాలు వదిలేవరు తాను మీతో ఉంటానని హామీ ఇచ్చారు. ఇక, సచివాలయ ఉద్యోగులు కూడా అమరావతి ఆందోళనకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు పవన్... తెలంగాణ ఉద్యమంలో అందరూ ఒక్కటయ్యారు.. మన దరిద్రం ఏంటంటే..? కులాలు, వర్గాలుగా మనం విడిపోయి బతుకుతున్నాం... అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.