సినిమాల్లోకి పవన్ వారసుడు.. ఎప్పుడంటే..!!

సినిమాల్లోకి పవన్ వారసుడు.. ఎప్పుడంటే..!!

పవన్ కళ్యాణ్ కు సినిమా రంగంలో ఎలాంటి గుర్తింపు ఉన్నదో చెప్పక్కర్లేదు.  పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.  మెప్పించారు.  తనకంటూ సొంతంగా ఇమేజ్ ను తెచ్చుకున్నాడు ఈ హీరో. అయితే, తన 25 వ సినిమా అజ్ఞాతవాసి సినిమా తరువాత పవర్ స్టార్ జనసేన పార్టీని స్థాపించి సినిమాలకు దూరంగా ఉంటున్నారు.  

ఇదిలా ఉంటె పవన్ కొడుకు అకీరా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైంది.  ఇప్పటికే అకీరా మరాఠీలో ఓ సినిమా చేశారు.  దాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నారు.  కానీ, పవన్ కొడుకు అకీరాను ఇలా డబ్బింగ్ సినిమాతో లాంచ్ చేయకుండా.. ఒక హీరో కొడుగ్గానే లాంచ్ చేయాలని చూస్తున్నారు.  మరో కొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించిన అన్ని విషయాలు బయటకు రాబోతున్నది.  అకీరా ఎంట్రీకి అన్ని రకాలుగా రంగం సిద్ధం చేస్తున్నారు.  ఈ ఏడాదిలోనే అకిరా లాంచింగ్ ఉంటుందని అంటున్నారు.  ఎవరు ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు అన్నది త్వరలోనే తేలిపోతుంది.  అందుతున్న సమాచారం ప్రకారం అన్నయ్య రామ్ చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్లోనే సినిమా ఉండబోతుందని సమాచారం.