ఆర్టీసీ సమ్మె.. పోరాటానికి పవన్ రెడీ..

ఆర్టీసీ సమ్మె.. పోరాటానికి పవన్ రెడీ..

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది... ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజాసంఘాలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించగా.. ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటానికి రెడీ అన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. టీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుందని జనసేన తెలంగాణ విభాగం ప్రకటించింది. కార్మికుల తరుపున ఉద్యమించడానికి, రోడ్ల మీదకు రావడానికి తమ అధినేత పవన్‌ సిద్ధంగా ఉన్నారని.. ఆ పార్టీ విభాగం తెలిపింది. జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు.