నేల టిక్కెట్ జోష్ పెంచుతున్న పవన్

నేల టిక్కెట్ జోష్ పెంచుతున్న పవన్
రవితేజ హీరోగా నటిస్తున్న నేల టిక్కెట్ సినిమా మే 24  న విడుదల కాబోతున్నది.  ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు.  రవితేజ సినిమా అంటేనే ఫుల్ జోష్ గా ఉంటుంది. కామెడీ ఎంటర్టైనర్  సినిమాలు చేయడం అంటే రవితేజకు వెన్నతో పెట్టిన విద్య.  
ఈమధ్య రవితేజ తన రూట్ మార్చి మాస్ సినిమాలు చేస్తూ.. మాస్ మహారాజా అనిపించుకుంటున్నారు.  ఇప్పుడు నేల టిక్కెట్ గా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రవితేజ సిద్ధమవుతున్నారు.  విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ఆడియో మే 12 న విడుదల కాబోతున్నది.  ఈ ఆడియో వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.  ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రాబోతున్నారట.  మెగా ఫ్యామిలీ పట్ల రవితేజ కు మొదటి నుంచి మంచి అభిమానం ఉన్న సంగతి తెలిసిందే.  పవన్ కళ్యాణ్ రాకతో నేల టిక్కెట్ జోష్ మరింత పెరుగుతుందని నిర్మాతలు చెప్తున్నారు.  రామ్ తుళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ సంగీతాన్ని అందిస్తున్నారు.