ఈనెల 21న తిరుపతికి జనసేన అధినేత పవన్..

ఈనెల 21న తిరుపతికి జనసేన అధినేత పవన్..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ మృతిచెందడంతో ఇప్పుడు తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే...అయితే ఇప్పటికే వైసీపీ పార్టీ తమ అభ్యర్థిపై క్లారిటీ రాగా.. మిగతా అభ్యర్థులు తేలాల్సి ఉంది. టీడీపీ విడిగా బరిలోకి దిగితే.. జనసేన, బీజేపీ కలిసి ఒకే అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో  జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తిరుపతి వెళ్లనున్నారు.  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈనెల 21న తిరుపతిలో భేటీ కానుంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని తిరుపతికి పయనం కానున్నారు. ఈ భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్‌తో పాటు పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదేండ్ల మనోహర్‌ పాల్గొననున్నారు.  ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన కీలక విషయాలను చర్చించబోతున్నట్లుగా పార్టీ నాయకత్వం ద్వారా సమాచారం అందుతోంది. తిరుపతి ఉప ఎన్నికకు రోజులు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీతో పొత్తు కారణంగా సీటు వారికి వదిలి పెట్టాలా లేదంటే జనసేన అభ్యర్థిని పోటీకి దించాలా అనే విషయాన్ని ఈ సమావేశంలో చర్చిస్తారని కూడా సమాచారం అందుతోంది.