నేడు శ్రీకాకుళానికి పవన్...

నేడు శ్రీకాకుళానికి పవన్...

ఇవాళ శ్రీకాకుళం వెళ్లనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... నిన్న విజయవంతంగా కవాతు నిర్వహించి... పాలక, ప్రతిపక్షాల తీరును ఎండగట్టిన జనసేనాని... ఈ రోజు రాజమండ్రి నుంచి శ్రీకాకుళం వెళ్తారు. తిత్లీ తుఫాన్ విధ్వంసంతో తీవ్రంగా నష్టపోయి, సర్వకోల్పోయిన బాధితులను రేపు పరామర్శించనున్నారు పవన్ కల్యాణ్. మరోవైపు తిత్లీ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.