సైరాలో పవన్ వాయిస్ విన్నారా..?

సైరాలో పవన్ వాయిస్ విన్నారా..?

మెగాస్టార్ చిరంజీవి సైరా మూవీ టీజర్ రేపు రిలీజ్ కాబోతున్నది. ఈ టీజర్లో చాలా స్పెషల్స్ ఉన్నాయి.  అందులో ఒకటి పవన్ కళ్యాణ్ వాయిస్.  టీజర్ కోసం పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.  ఈ విషయం తెలిసిన తరువాత టీజర్లో పవన్ వాయిస్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ పెరిగింది.  అయితే, అభిమానుల కోసం కొణిదెల ప్రొడక్షన్ సంస్థ పవన్ వాయిస్ ఎలా ఉండబోతోందనే శాంపిల్ ను ట్విట్టర్లో చిన్న వీడియో రూపంలో పోస్ట్ చేసింది.  

చిన్న వీడియోలో మెగాస్టార్, పవన్ హావభావాలు ఎలా ఉన్నాయో చూపించారు.  వీడియో చివర్లో పవన్ కళ్యాణ్ బిగ్గరగా సైరా నరసింహారెడ్డి అని చెప్పడంతో వీడియో క్లోజ్ అయ్యింది.  వాయిస్ పర్ఫెక్ట్ గా రావడంతో మెగాస్టార్ హ్యాపీగా ఫీలయ్యారు.  ప్రొడక్షన్ సంస్థ పోస్ట్ చేసిన ఈ వీడియో ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.