జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన పవన్... ఎందుకంటే..?

జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన పవన్... ఎందుకంటే..?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఏ నిర్ణయంలోనైనా తప్పులు వెతికే జనసేన అధినేత వపన్ కల్యాణ్... ఈ సారి ఆయన తీసుకునే నిర్ణయాన్ని స్వాగతించారు. ఇంతకీ ఏ విషయంలో జగన్‌ నిర్ణయాన్ని సమర్థించారనే అనుమానం వెంటనే కలగొచ్చు.. విషయం ఏంటంటే.. సంచలన సృష్టించిన సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.. నిన్న కర్నూలులో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సుగాలి ప్రీతి తల్లి పార్వతి బాయితో ఈ కేసు విషయంపై మాట్లాడిన జగన్.. ఈ కేసును సీబీఐకి రిఫర్‌ చేస్తున్నామని, తప్పక న్యాయం జరుగుతుందని వారికి భరోసానిచ్చారు. అలాగే కుటుంబాన్ని ఆదుకుంటామని, వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.. దీనిపై స్పందించిన జనసేనాని.. సుగాలి ప్రీతి కేసు సీబీఐకి ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం మంచి పరిణామం అన్నారు.. జగన్ సర్కార్ నిర్ణయం సుగాలి ప్రీతి కుటుంబానికి ఊరట ఇచ్చే విషయమని ప్రశంసలు కురిపించిన ఆయన.. ఇప్పటికే కేసు విచారణ ఆలస్యమైంది... సీబీఐ విచారణను వేగవంతం చేయాలని కోరారు.