కీర్తి సురేష్ ను అభినందించిన పవన్ కళ్యాణ్..!!

కీర్తి సురేష్ ను అభినందించిన పవన్ కళ్యాణ్..!!

66 వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రపరిశ్రమ వివిధ కేటగిరిలో ఏడు అవార్డులు సొంతం చేసుకుంది.   ఉత్తమ తెలుగు చలనచిత్రంగా మహానటి ఎంపికైతే, ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ఎంపికైంది.  దీంతో పాటు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరీ అవార్డు కూడా మహానటి గెలుచుకుంది. ఉత్తమ నటిగా ఎంపికైన కీర్తి సురేష్ కు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున అభినందనలు తెలిపారు.  మహానటి సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి సురేశ్ నటన అవార్డుకు అన్ని విధాల అర్హమైనదేనని ఆయన అన్నారు. అలాగే  రామ్ చరణ్ రంగస్థలం, అ!, చి.ల.సౌ సినిమాలకు సంబంధించి సాంకేతిక విభాగాల్లో అవార్డులకు ఎంపికైన వారిని కూడా అభినందించారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు.