ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్..

ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపుతూ ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన ' జూన్ 2.. మనందరికీ పండుగ రోజు. తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు. అనేక మంది యోధుల త్యాగ ఫలంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు. ఇటువంటి పర్వదినాన తెలంగాణ బిడ్డలందరికీ నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు జనసేనాని పవన్.