పవన్ పోరాట యాత్ర షెడ్యూల్ 

పవన్ పోరాట యాత్ర షెడ్యూల్ 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పోరాట యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. నిన్ననే ఉద్దానం భాదితులకు అండగా ఒక్కరోజు నిరాహార దీక్ష చేశారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం 1 నుండి పోరాటయాత్రను పారరంభించనున్నారు. ఈ సంధర్భంగా రెండు రోజుల టూర్ షెడ్యూల్ ను జనసేన పార్టీ విడుదల చేసింది. 

ఈ రోజు 2 గంటలకు నరసన్నపేట, 4 గంటలకు పాతపట్నం, 6 గంటలకు ఆముదాలవలస నియోజక వర్గానికి చేరుకుంటారు. అక్కడే ప్రజలను ఉద్దేశించి ఓ పబ్లిక్ మీటింగ్ పవన్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంతో ఈ రోజు టూర్ పూర్తవుతుంది. 28వ తేదీ షెడ్యూల్లో  మధ్యాహ్నం 2 గంటలకు పాలకొండ, 4 గంటలకు రాజాం, 6 గంటలకు రణస్థలం (ఎచ్చెర్ల) నియోజకవర్గాల్లో పబ్లిక్ మీటింగ్ లు జరగనున్నాయి. ఇప్పటి వరకు నాలుగు రోజుల పాటు జరిగిన పోరాటయాత్రలో పవన్..రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ప్రత్యేక హోదాపై కేంద్రం తీరును పబ్లిక్  మీటింగ్స్ ద్వారా ఎండగట్టారు.