జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్ కి పవన్ సత్కారం

జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్ కి పవన్ సత్కారం

రచయిత, గాయకుడు  పెంచల్ దాస్ రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలికాన్నీ నేటి తరానికి చేరువ చేస్తున్న విధానం అభినందనీయం అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. గీత రచయిత, గాయకుడు పెంచల్ దాస్ మంగళవారం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలుగు జానపదాలు, సీమ మాండలికంపై ఇరువురు మధ్య కొంత సేపు చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్ కూడా పాల్గొన్నారు. అనంతరం పెంచల్ దాస్ ను పవన్ కళ్యాణ్ శాలువాతో సత్కరించారు.