పవన్ .. రామ్ చరణ్ సినిమా ఉంటుందా?

పవన్ .. రామ్ చరణ్  సినిమా ఉంటుందా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళకముందు రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయాలనీ అనుకున్నారు.  దానికి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి.  త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుందని అనుకున్నారు.  ఆ తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వలన సినిమాలకు దూరంగా ఉన్నారు.  

అయితే, ఇన్నాళ్లకు మరలా ఈ సినిమా గురించిన న్యూస్ బయటకు వచ్చింది.  పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయడానికి సిద్ధంగాఉన్నారని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ బయటకు వస్తుందని అంటున్నారు.  ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయ్యాక ఈ సినిమా ఉండబోతుంది.  పవన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో సినిమా ఉండొచ్చని అంటున్నారు.  చూద్దాం.