ప్రభుత్వానికి పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి..

ప్రభుత్వానికి పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి..

రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించి విత్తనాలు అందజేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కోరారు. ధాన్యం కొనుగోలు చేశాక చెల్లింపులో జాప్యం చేయడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఇవాళ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పెట్టుబడుల కోసం రైతులు అప్పు చేసే పరిస్థితి నెలకొందన్న ఆయన.. రైతులకు రూ.610.86 కోట్లు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయకుండా పొలంలో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునేలా ప్రభుత్వం చొరవ చూపించాలని పవన్‌ కోరారు.