ఆస్తులు ప్రకటించిన పవన్ కల్యాణ్

ఆస్తులు ప్రకటించిన పవన్ కల్యాణ్

గాజువాక అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆస్తులు ప్రకటించారు. తన పేరిట రూ.12.79 కోట్ల విలువైన చరాస్థులు ఉన్నాయని పేర్కొన్న పవన్‌... రూ.40 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక.. అక్షరాలా రూ.32 కోట్ల అప్పులున్నాయని ప్రకటించారు. ఇందులో.. తనకు అత్యంత సన్నిహితుడైన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర రూ.2.40 కోట్ల మేర అప్పు తీసుకున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ దగ్గర రూ. 1.25 కోట్లు, తన వదిన సురేఖ దగ్గర రూ.1.07 లక్షలు అప్పు తీసుకున్నానని జనసేనాని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎం.ప్రవీణ్ కుమార్‌కు రూ.3 కోట్లు, ఎంవీఆర్ఎస్ ప్రసాద్‌కు రూ.2 కోట్లు, శ్రీ బాలాజీ సినీ మీడియాకు రూ.2 కోట్లు, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రాలయకు రూ.27.55 లక్షలు ఇవ్వాల్సి ఉందని పవన్ తెలిపారు. వీటిలో చాలా వరకు సినిమాలకు అడ్వాన్స్‌ల కింద తీసుకున్నవేనని భావిస్తున్నారు. తాను పదోతరగతి పాస్ అయినట్లు పవన్‌ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.