ఆస్పత్రి నుంచి పవన్‌కల్యాణ్‌ డిశ్చార్జి

ఆస్పత్రి నుంచి పవన్‌కల్యాణ్‌ డిశ్చార్జి

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ప్రచారంలో పాల్గొన్నా ఆయనకు వడదెబ్బ తగిలింది. సాయంత్రం విజయనగరం జిల్లా పర్యటన ముగించుకుని గుంటూరు జిల్లాలో ప్రచార సభలకు వెళ్లేందుకు విజయవాడకు చేరుకున్న పవన్‌ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయణ్ను వ్యక్తిగత సిబ్బంది ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.  భోజనం తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేట్‌ అయి పవన్‌ అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పారు.