జగన్‌కు కొంత టైమ్‌ ఇస్తున్నాం: పవన్‌

జగన్‌కు కొంత టైమ్‌ ఇస్తున్నాం: పవన్‌

గత ఎన్నికల సమయంలో కొత్త రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరమనే టీడీపీకి మద్దతిచ్చామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చెప్పారు. అందుకే టీడీపీ ప్రభుత్వానికి సమయం ఇచ్చిమని, అలాగే వైసీపీకి కూడా ఇప్పుడు కొంత సమయం ఇస్తామని చెప్పారు. జనసేన కమిటీల ఏర్పాటుపై  ఇవాళ పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. విజయవాడలోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  టీడీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకూ ప్రశ్నించకుండా ఉన్నామని.. ఇప్పుడు కూడా వైసీపీ విధానలు, పాలన తీరు తెలిశాకే స్పందిస్తామన్నారు. కొత్త ప్రభుత్వం నిజంగా ప్రజలకు సత్ఫలితాలిచ్చే పథకాలు ప్రవేశపెడితే హర్షిస్తామని,  ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఎదురైతే పోరాడతామని పవన్‌ తెలిపారు.