లైఫ్‌ జాకెట్‌ లేకండా పవన్‌ బోటు ప్రయాణం!

లైఫ్‌ జాకెట్‌ లేకండా పవన్‌ బోటు ప్రయాణం!

లైఫ్ జాకెట్లు లేకుండా బోటులో ప్రయాణించడం ప్రమాదకరం. ముఖ్యంగా గోదావరి నదిలో బోటింగ్‌ చేసే సమయంలో లైఫ్‌ జాకెట్లు తప్పనిసరి. బోటింగ్‌ చేసేవారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అక్కడి అధికారులదే. గోదావరి నదిలో నిన్న బోటింగ్‌ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. లైఫ్‌ జాకెట్లు వేసుకోవకపోవడం చర్చనీయాంశంగా మారింది. పవన్‌తోపాటు బోటులో ఉన్న సిబ్బంది కూడా లైఫ్‌ జాకెట్లు వేసుకోకుండా ప్రయాణించడం.. అందుకు అధికారులు అనుమతించడం వివాదాస్పదంగా మారింది.