పార్టీ బలోపేతానికి పవన్‌కల్యాణ్‌ కీలక నిర్ణయం

పార్టీ బలోపేతానికి పవన్‌కల్యాణ్‌ కీలక నిర్ణయం

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ఫోకస్‌ పెట్టిన ఆయన.. పార్టీ కమిటీలు, నేతలు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 29వ తేదీ నుంచి ఈ భేటీలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్టు  ఆ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మంగళగిరి, విజయవాడలోని పార్టీ కార్యాలయాల్లోనే ఈ సమావేశాలు జరగుతాయి. పార్టీ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా కార్యకర్తలు, నేతలతో పవన్‌ చర్చిస్తారు.  

భేటీల షెడ్యూల్‌..

  • 29న ఉదయం 11 గంటలకు పార్టీ నాయకులు, వివిధ కమిటీల సభ్యులతో భేటీ
  • 29న సాయంత్రం 4గంటలకు పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం 
  • 30న ఉదయం 11 గంటలకు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం భేటీ 30న సాయంత్రం 4 గంటలకు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం భేటీ 31న ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం సమాశం