ఆయనే నాకు మార్గదర్శి: పవన్‌

ఆయనే నాకు మార్గదర్శి: పవన్‌

జనసేన పార్టీ హితం కోరుకునే మాజీ ఎంపీ హరిరామ జోగయ్య త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఆకాంక్షించారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్న జోగయ్యను పవన్ ఇవాళ ఉదయం పరామర్శించారు. తనకు మార్గదర్శిగా ఉండమని జోగయ్యను కోరితే ఆయన అంగీకరించారని పవన్‌ చెప్పారు. ఎంతో అనుభవం ఉన్న జోగయ్య సలహాలు తనకు అవసరమని అన్నారు. 

చిరంజీవి కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా హరిరామ జోగయ్య అన్నారు. చివరి శ్వాస వరకు జనసేనకు తన సేవలు అందుతాయని తెలిపారు. పవన్ వెంట అందరూ నడవాలని పిలుపునిచ్చారు.