నేడు నంద్యాలకు పవన్ కల్యాణ్..

నేడు నంద్యాలకు పవన్ కల్యాణ్..

జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ ఇవాళ కర్నూలు జిల్లా నంద్యాలకు వస్తారు. ఇటీవలే కన్నుమూసిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం ఎస్పీవై రెడ్డి సమాధి దగ్గర నివాళులర్పించనున్నారు. టీడీపీ నుంచి మరోసారి నంద్యాల లోక్‌సభ స్థానం టికెట్ ఆశించి భంగపడిన ఎస్పీవై రెడ్డి... సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన.. ఎన్నికల ప్రచార సమయంలో అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.