పవన్‌ కల్యాణ్‌ కీలక ప్రకటన రేపే

పవన్‌ కల్యాణ్‌ కీలక ప్రకటన రేపే

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విభాగాలకు కమిటీలు నియమించారు. ఈ కమిటీల వివరాలను రేపు పవన్‌ కల్యాణ్‌ విజయవాడలో ప్రకటించబోతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహించిన అనంతరం క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేసి, విశ్లేషించి ఈ కమిటీలకు ఆయన రూపమిచ్చారని పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే.. వాడవాడలా జనసేన జెండా రెపరెపలాడేలా పార్టీ శ్రేణులను ఉత్తేజితం చేసేందుకు కార్యక్రమాలను రూపొందించినట్టు తెలిసింది.  

ఇక.. రేపు ప్రకటించబోయే కమిటీలలో పార్టీ పోలిటికల్ అఫైర్స్ కమిటీ (పి.ఎ.సి.), లోకల్ బాడీ ఎలక్షన్స్ కమిటీ, క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఆర్డీఏ) మోనిటరింగ్ కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మోనిటరింగ్ వంటి ముఖ్యమైన కమిటీలు ఉన్నాయి.