పవన్ నో చెప్పిన కథకు.. రామ్ ఓకే చెప్పాడా..?

పవన్ నో చెప్పిన కథకు.. రామ్ ఓకే చెప్పాడా..?

సినిమాల్లోతిరిగి అడుగుపెట్టిన తర్వాత పవన్ వరుసగా సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పటికే పింక్ రీమేక్ ను పూర్తి చేసిన పవన్, క్రిష్ సినిమాను కూడా మొదలుపెట్టాడని తెలుస్తుంది. ఆ తర్వాత ,మరి కొంత మంది దర్శకులతో వర్క్ చేయబోతున్నాడు. ప్రస్తుతం కమిట్ అయిన మూడు సినిమాలు పూర్తిచేసి...అటుపై బాబీ...పూరి జగన్నాథ్ లతో పవన్ సినిమాలు చేస్తున్నాడని తెలుస్తుంది. పవన్ ల్యాండ్ మార్క్ సినిమా పీఎస్.పీకే 30 సినిమాపూరి డైరెక్షన్ లో ఉంటుందని అంటున్నారు. 

ఇదిలా ఉంటే ఇటీవల దర్శకుడు బాబీకి పవన్ కు ఒక స్టోరీ లైన్ వినిపించాడని ఆ లైన్ పవన్ కు నచ్చక పోవడంతో నో చెప్పాడని తెలుస్తుంది. ఇక ఇదే లైన్ ను ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు చెప్పగానే రామ్ ఒప్పుకున్నాడట. బౌండెడ్ స్టోరీతో రమ్మని  బాబీ చెప్పాడట. దాంతో పవన్ సినిమా రామ్ కు షిఫ్ట్ అయ్యిందని తెలుస్తుంది. మరి బాబీ పవన్ కోసం మరో కథను సిద్ధం చేస్తాడో లేదో చూడాలి.