పాయల్ ఆర్డీఎక్స్ ... టాలీవుడ్ అలర్ట్..!!

పాయల్ ఆర్డీఎక్స్ ... టాలీవుడ్ అలర్ట్..!!

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేసింది.  నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రతో పాటు తన బోల్డ్ యాక్టింగ్ తో బోలెడంతమందిని బౌల్డ్ చేసింది. ఈ సినిమా మౌత్ టాక్ తో మంచి విజయం సాధించింది.  ఈ మూవీ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న పాయల్.. సీనియర్ నటుడు వెంకటేష్ తో వెంకిమామ చేస్తోంది.  ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఇది సెట్స్ మీద ఉండగానే.. పాయల్ మరో మూవీని సెట్ చేసింది.  

అదే ఆర్డిఎక్స్ లవ్.  దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవలే వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ అయింది.  ఇందులో కూడా పాయల్ మరోసారి తన బోల్డ్ లుక్ తో ఆకట్టుకోబోతున్నట్టు తెలుస్తోంది.  రీసెంట్ గా పాయల్ కు సంబంధిచిన ఓ పోస్టర్ను యూనిట్ రిలీజ్ చేసింది.  ఇందులో రెడ్ కలర్ డ్రెస్ లో పాయల్ మరింత అందంగా కనిపించడం విశేషం.  ఆర్డిఎక్స్ టైటిల్ కు పర్ఫెక్ట్ యాప్ట్ అని  పోస్ట్ ను చూస్తుంటే అర్ధం అవుతుంది.  సినిమా రిలీజ్ తరువాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.