పాయల్ పాప ప్లస్ 2 ఫోటో చూసారా ..
పాయల్ రాజ్ పుత్ 'ఆర్ఎక్స్ 100' చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి.ఆర్ఎక్స్ 100 చిత్రం పాయల్ రాజ్ పుత్ కు ఫస్ట్ మూవీ. అయినా కూడా ఏమాత్రం మొహమాట పడకుండా అందాలను ఆరబోసింది.ఇక వెంకటేష్ నాగచైతన్య కాంబినేషన్ లో 'వెంకీమామ' సినిమాలో, రవితేజ డిస్కో రాజాలో నటించిన ఆ సినిమాలు అమ్మడి ఆశలను అడియాశలు చేసాయి . కాగా సోషల్ మీడియాలో పాయల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. . తాజాగా పాయల్ రాజ్ పుత్ ప్లస్ 2 లో దిగిన ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో దర్శనమిచ్చింది అప్పట్లో కాస్త బొద్దుగా ముక్కుపుడక పెట్టుకొని క్యూట్ గా ఉంది పాయల్. టీనేజ్ పాయల్ చూసిన కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఇలాంటి అమ్మాయి మన కాలేజ్ లో లేదే అని తెగ ఫీలైపోతున్నారు. ఏది ఏమైనా అప్పటికి ఇప్పటికి పాయల్ పక్కింటి అమ్మాయిలా కనిపించి కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతూనే ఉంది .
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)