సీనియర్ హీరోతో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ రొమాన్స్ !

సీనియర్ హీరోతో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ రొమాన్స్ !

సీనియర్ హీరో రవితేజ డిసెంబర్ నెలలో విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రారంభించనున్నాడు.  ఈ సినిమాలో 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ కథానాయకిగా నటించనుందని వినికిడి.   'ఆర్ఎక్స్ 100' సినిమాలో పాయల్ నటనకు కుర్రకారు ఎంతలా ఫిదా అయ్యారో తెలిసిన సంగతే. 

ఈమెతో పాటే నాభ నటేష్ కూడ ఇందులో మరొక కథానాయకిగా నటించనుంది.  త్వరలోనే ఈ విషయానికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలకానుంది.  గతంలో 'ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడ' వంటి డిఫరెంట్ సినిమాల్ని చేసిన విఐ ఆనంద్ ఈ సినిమాను ఏ జానర్లో రూపొందిస్తారో అని అందరిలోను ఆసక్తి నెలకొంది ఉంది.