ఇండియాలో పేటియం ను మొదట ఎక్కడ ఉపయోగించారో తెలుసా?
ఇండియాలో పేటియం ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. దేశంలో పెద్దనోట్ల రద్దు తరువాత పేటియం వినియోగం బాగా పెరిగిపోయింది. 2015 లో పేటియం ను ప్రారంభించారు. అదే సమయంలో ఆ సమయంలోనే పెద్ద నోట్లు రద్దు కావడంతో పేటి యం ద్వారానే డబ్బును ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి పేటియం పాపులర్ అయ్యింది. అయితే, పేటియం ద్వారా మొదటి ట్రాన్సక్షన్ ను ఎవరు చేశారు అనే విషయం ఎవరికైనా తెలుసా అంటే తెలియదనే చెప్తారు. మొదటి ట్రాన్సక్షన్ ను 2015 సెప్టెంబర్ 29 వ తేదీన జరిగింది. హర్యానాలోని ఓ గ్రోసరీ షాప్ లో పేటియం ద్వారా మొదటి ట్రాన్సక్షన్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పేటి యం ద్వారా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతున్నది. దేశంలో 50 లక్షల మంది షాప్ యజమానులు ఈ పేటియం ను వినియోగిస్తున్నట్టు పేటియం సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)