రాజధాని ప్రకటన తర్వాతే కొన్నా : సర్కార్ కి పయ్యావుల సవాల్

రాజధాని ప్రకటన తర్వాతే కొన్నా : సర్కార్ కి పయ్యావుల సవాల్

అమరావతిలో ఆస్తుల కొనుగోలు విషయంలో పాలక ప్రతిపక్షాల పక్షం మధ్య మాటల తూటాలు పేలాయి. రాజధాని అమరావతిలో తాను భూమి కొన్న విషయం వాస్తవమేనన్నారు టీడీపీ సభ్యుడు పయ్యావుల. బినామీ ఆస్తులంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిని మార్చాలనే ఆలోచనతోనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బినామీ ఆస్తులున్నాయని చాలా మంది తన పేరు చెప్పారన్నారు. బినామీ ఆస్తులిచ్చి డబ్బులు తేవడం అంత ఈజీనా అని ప్రశ్నించారు. రాజధాని ప్రకటన తర్వాతే భూములు కొన్నామని  కేశవ్‌ అన్నారు.  రాజధానిపై 1-9-2014న కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు. రాజధానిపై 4-9-2014న అసెంబ్లిdలో చర్చ జరిగిందన్నారు. రాజధాని ప్రకటన వెలువడిన 40 రోజుల తర్వాత తాను భూమి కొన్నానని వివరించారు. మోడీ వచ్చాక బినామీల చట్టం తీసుకొచ్చారన్నారు. బినామీల చిట్టాను కేంద్రానికి పంపండి ఆ ఆస్తులన్నింటినీ జప్తు చేయించండని పయ్యావుల సవాల్ విసిరారు. 

పయ్యావుల వ్యాఖ్యలకు బుగ్గన స్పందించారు. పయ్యావుల విక్రమ్‌ సింహా ఆస్తులు కొన్నారా.. లేదా? అని ప్రశ్నించారు. డిసెంబర్‌లో ప్రభుత్వం జీవో ఇస్తే.. అంతకు ముందే భూములు ఎలా కొన్నారని ప్రశ్నించారు. ఇల్లు కట్టుకోవడానికే నాలుగు ఎకరాలు కొన్నామని పయ్యావుల చెబుతున్నారని పేర్కొన్నారు. ఆధారాలతో సహా వాస్తవాలు చెబుతుంటే ఎందుకు కంగారు పడుతున్నారు? అని ప్రశ్నించారు. ఆధారాలతో వాస్తవాలు నిరూపించిన తర్వాత ఛాలెంజ్‌లు ఎందుకు? అని ప్రశ్నించారు. 2014 డిసెంబర్‌ 30న సీఆర్డీఏ బిల్లు ఆమోదమైందని, సీఆర్డీఏ బిల్లు ఆమోదైన తర్వాత రాజధాని గ్రామాలను నోటిఫై చేశారని మంత్రి బుగ్గన అన్నారు.