26 తగ్గిన పీసీ జ్యువెలర్స్ షేర్

26 తగ్గిన పీసీ జ్యువెలర్స్ షేర్

షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనను ఉపసంహరిస్తున్న కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రకటించడంతో పీసీ జ్యువెలర్స్ షేర్‌ దాదాపు 26 శాతం  క్షీణించింది. దిగువస్థాయిలోనూ మద్దతు అందక పోవడంతో రూ. 88.95 అంటే 25.81 శాతం నష్టంతో ఈ షేర్‌ ముగిసింది. కంపెనీ షేర్లను రూ.424 కోట్లతో బైబ్యాక్‌ చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. దీనికి అనుమతి ఇవ్వాల్సిన బ్యాంకులు... అనుమతికి నిరాకరించాయి. బ్యాంకులు ఎన్‌ఓసీ ఇస్తేనే బైబ్యాక్‌ ప్రక్రియ ప్రారంభమౌతోంది. ఎన్‌ఓసీ రాకపోవడంతో తమ బైబ్యాక్‌  ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. దీంతో భారీ ఎత్తున వచ్చిన ఒత్తడికి షేర్ 26 శాతం క్షీణించింది.