గంగూలీ  వ్యాఖ్యల పై స్పందించిన పీసీబీ ఛైర్మన్‌...

గంగూలీ  వ్యాఖ్యల పై స్పందించిన పీసీబీ ఛైర్మన్‌...

ఈ సంవత్సరం జరగబోయే ఆసియాకప్ పాకిస్థాన్ లో కాదు దుబాయ్ లో జరుగుతుంది అని బీసీసీఐ ఛైర్మన్‌ సౌరవ్ గంగూలీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే గంగూలీ వ్యాఖ్యలను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ (పీసీబీ) ఛైర్మన్‌ ''ఎహ్సాన్‌ మణి'' వ్యతిరేకించారు. అసలు విషయం ఏమిటంటే... ఈ ఏడాది జరగబోయే ఆసియాకప్ కు పాకిస్థాన్ ఆతిధ్యం ఇవ్వాల్సింది. అయితే భద్రత కారణాల వల్ల పాకిస్థాన్ కు భారత జట్టు ను పంపలేమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పారు. అంతే కాదు ఈ సారి ఆసియాకప్ దుబాయ్ లో జరుగుతుందని ఇండియా పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ ఉంటుందని తెలిపారు. అయితే గంగూలీ  చేసిన ఈ వ్యాఖ్యలను పీసీబీ ఛైర్మన్‌ వ్యతిరేకించారు. ఆయన ఓ పత్రిక సమావేశంలో ''ఆసియాకప్ ఇక్కడ పాకిస్థాన్ లో జరగకపోయినంత మాత్రాన ఇక దానికి దుబాయ్ ఒకటే వేదిక కాదు అని తెలిపారు. మార్చి 3న దుబాయ్‌లో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసిసి) సమావేశం జరగనుంది. అందులో ఆసియా కప్‌ లో పాల్గొనే అని దేశాలకు సంబంధించిన   క్రికెట్‌ బోర్డ్స్ కలిసి ఈ టోర్నీపై నిర్ణయం తీసుకుంటాయి. అని అన్నారు. అయితే చివరగా 2018 లో జరిగిన ఆసియాకప్ భారత్ లో జరగాల్సి ఉండగా పీసీబీ తమ ఆటగాళ్లను ఇక్కడికి పంపడానికి నిరాకరించింది. అందువల్ల ఆ టోర్నీని దుబాయ్‌, అబుదాబి లో నిర్వహించారు. అయితే ఆ కప్ భారత్ సాధించిన విషయం అందరికి తెలుసు.