భారత ప్రభుత్వ విధానాల కారణంగా వారు మాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడరు: పీసీబీ చీఫ్

భారత ప్రభుత్వ విధానాల కారణంగా వారు మాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడరు: పీసీబీ చీఫ్

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహ్సాన్ మణి మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ప్రపంచ క్రికెట్ ఆరోగ్యానికి మంచిదని అన్నారు. పీసీబీ తన సీనియర్ జాతీయ జట్టుకు మ్యాచ్లను ప్లాన్ చేసేటప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా ద్వైపాక్షిక సిరీస్ ను పరిగణనలోకి తీసుకోదని మణి చెప్పారు. భారత్-పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్‌లు సంచలనం సృష్టిస్తాయని, అయితే భారత ప్రభుత్వ విధానాల వల్ల ఇరు జట్లు  ద్వైపాక్షిక సిరీస్ లో పోటీపడలేవని తెలిపారు. భారతదేశం మరియు పాకిస్తాన్ జనవరి 2013 నుండి ద్వైపాక్షిక క్రికెట్ ఆడలేదు, ఆ చివరి సిరీస్ లో పాకిస్తాన్ భారత పర్యటనకు వచ్చింది, అందులో 2 టీ 20 మరియు 3 వన్డేలు ఆడారు. 2007-08 సీజన్ నుండి ఇరు జట్లు టెస్ట్ సిరీస్‌లో కలుసుకోలేదు. గతంలో ద్వైపాక్షిక సిరీస్‌ను నిర్వహించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు."పాకిస్తాన్-ఇండియా మ్యాచ్‌లు ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన క్రికెట్ మ్యాచ్‌లు" అని మణి పేర్కొన్నారు.  అయితే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరియు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) టోర్నీలో తప్ప ఈ రెండు జట్లు కలిసి ఆడటం లేదు. అయితే క్రికెట్ బోర్డులు స్వల్పకాలిక ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రపంచ ఆట యొక్క శ్రేయస్సుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మణి అన్నారు.