ఆసియా కప్ రద్దు : తోక ముడిచిన పాకిస్థాన్ బోర్డు.. 

ఆసియా కప్ రద్దు : తోక ముడిచిన పాకిస్థాన్ బోర్డు.. 

ఈ ఏడాది జరగాల్సిన  ఆసియా హోస్టింగ్ హక్కులు తమకు ఉన్నాయన్న ఒక్కేఒక్క కారణంతో చెలరేగిపోయింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే మాకు 4000 కోట్ల నష్టం వస్తుంది అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించినప్పటి నుండి దానిని అడ్డుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చెయ్యాలో అన్ని చేసింది. అయితే ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ సమయంలో ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ జరగాల్సి ఉంది. అయితే ఆ టోర్నీ జరిగే అవకాశాలే కనిపించక పోవడంతో ఐపీఎల్ ఆ విండోలో జరపాలని బీసీసీఐ చూస్తుంది. అంతే అదే సమయంలో మేము ఆసియా కప్ నిర్వహించాలనుకుంటున్నాము అని ప్రకటించింది పీసీబీ. ఆ తర్వాత పీసీబీ మాత్రమే కాదు మాజీ పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ కంటే ఆసియా కప్ ముఖ్యమైనది అంటూ వ్యాఖ్యలు చేసారు. కానీ నిన్న అధికారికంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) 2020 ఆసియా కప్ వచ్చే ఏడాదికి  వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని గంగూలీ ఎసిసి కంటే ఒక రోజు ముందే చెప్పేసాడు. అయితే ఇన్ని రోజులు ఆసియా కప్ తప్పకుండ నిర్వహిస్తాం అని చెప్పిన పీసీబీ జాడ ఇప్పుడు కనిపించడం లేదు. ఎసిసి అధికారిక ప్రకటన తర్వాత కూడా ఇప్పటివరకు ఈ విషయం పై పాకిస్థాన్ బోర్డు స్పందించలేదు. చూడాలి మరి ఈ విషయం పై పీసీబీ ఎప్పుడు ఏ విధంగా స్పందిస్తుంది అనేది.