పరీక్షలు నిర్వహించిన తర్వాతే మాలిక్ ఇంగ్లాండ్ ప్రయాణం...

పరీక్షలు నిర్వహించిన తర్వాతే మాలిక్ ఇంగ్లాండ్ ప్రయాణం...

కరోనా కారణంగా వాయిదా పడిన తమ ఇంగ్లాండ్ పర్యటనను మళ్ళీ షెడ్యూల్ చేసి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ ఆటగాళ్లను అక్కడికి పంపింది. అయితే ఈ 3 మ్యాచ్‌ల టెస్ట్, టీ 20 సిరీస్‌కు ముందు పాక్ జట్టులో కరోనా కలకలం రేపింది. జూన్ 28 న ఇంగ్లాడ్ ప్రయాణానికి ముందు ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి  పీసీబీ కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ ఆ తర్వాత కరోనా నుండి కోలుకున్న వారందరిని మళ్ళీ ఇంగ్లాండ్ కు పంపింది పీసీబీ. అయితే కరోనా కారణంగా ఐదు నెలలుగా కలుసుకోని తన కుటుంబంతో కొంత సమయం గడిపి ఆలస్యంగా ఇంగ్లండ్‌లోని పాకిస్తాన్ జట్టులో చేరడానికి ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్‌కు పీసీబీ అనుమాతి ఇచ్చింది. కరోనా లాక్ డౌన్ సమయం లో మాలిక్ పాకిస్థాన్‌లో ఉండగా, అతని భార్య, టెన్నిస్ క్రీడాకారిణి అయిన సానియా మీర్జా మరియు అతని కుమారుడు ఇజాన్ భారతదేశంలో ఉన్నారు. అయితే మాలిక్, టెస్ట్ మరియు వన్డే నుండి రిటైర్ అయిన టీ 20 ఫార్మాట్ లో కొనసాగుతున్నాడు. అందువల్ల ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 1 వరకూ ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్‌ జరగనుంది. అక్కడికి వెళ్లిన వెంటనే మాలిక్ 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. అందువల్ల ఆగస్టు 15 వరకు మాలిక్‌ని ఇంగ్లాండ్ పంపేందుకు పీసీబీ ఏర్పాట్లు చేస్తోంది.